నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన యువతిని మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే నెపంతో.. యువకుడి కుటుంబంపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వరుడి వదిన.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రేమ పెళ్లి వివాదం.. వరుడి వదిన మృతి - attacks on groom relatives
ప్రేమ పెళ్లి వ్యవహారంలో అబ్బాయి బంధువులపై అమ్మాయి వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో ఇది జరిగింది.
Love marriage dispute
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:Murder:మంత్రగాడనే నెపంతో హత్య.. నిందితులు అరెస్ట్