తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide: ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య - krishna district latest news

ఏపీలోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

By

Published : May 30, 2021, 10:40 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి సమీపంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శనివారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప గ్రామాల్లో విచారించగా.. ప్రేమికులిద్దరూ పెదకళ్లేపల్లి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇరువురి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఎన్టీపీసీలో అగ్ని ప్రమాదం.. రూ.3 కోట్ల నష్టం

ABOUT THE AUTHOR

...view details