Nanakramguda Cylinder Blast: అందరు హాయిగా నిద్రపోతున్న సమయంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నానక్రామాగూడాలోని హనుమాన్ దేవాలయం దగ్గర్లోని ఓ ఇంట్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు గ్యాస్ సిలిండర్ పేలింది. ఉత్తరాది నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు.... కూలీ పనులు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున నిద్ర మేల్కొంటుండగా... వారు ఉంటున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు గచ్చిబౌలి సీఐ సురేశ్ తెలిపారు.
Nanakramguda cylinder blast video: గ్యాస్ సిలిండర్ పేలుడు.. 11 మందికి గాయాలు - పేలుడు దృశ్యాలు
07:37 November 23
సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం
ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి (Cylinder Blast) ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయ చర్యలు అందించారు.
క్షతగాత్రుల్లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన తొమ్మిది మందిని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఇదీ చూడండి:Cylinder Blast: గ్యాస్ లీకై వ్యాపించిన మంటలు.. ముగ్గురు మృతి