తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టి.. ఇళ్లపైకి దూసుకెళ్లిన లారీ - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా నేర వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టిన లారీ... పక్కనున్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Larry rolled over
లారీ బోల్తా

By

Published : Apr 10, 2022, 11:31 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో కోళ్ల దాన బస్తాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. భారీ శబ్దంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టినప్పుడు కరెంటు వైర్లు తెగిఉంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగి ఆస్తి నష్టం వాటిల్లేదని స్థానికులు పేర్కొన్నారు.

ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద గండం నుంచి బయటపడినట్లైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి ఖమ్మంకు కోళ్ల దాన చేరవేసేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మం-వరంగల్ రహదారి కావటంతో ప్రతి రోజు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోయారు. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

ఇదీ చదవండి:Cricket Betting: తెలుగునాట క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు.. బుకీల చేతుల్లో చిక్కి యువత బలి

ABOUT THE AUTHOR

...view details