తెలంగాణ

telangana

ETV Bharat / crime

డివైడర్​ను ఢీకొన్న లారీ.. మేకలు మృతి - jagtial district crime news

మేకల లోడ్​తో వెళ్తున్న లారీ డివైడర్​ను ఢీకొట్టిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కొన్ని మేకలు మృత్యువాత పడ్డాయి.

lorry accident, lorry accident in jagtial
లారీ ప్రమాదం, జగిత్యాలలో లారీ ప్రమాదం

By

Published : Apr 8, 2021, 9:21 AM IST

మేకల లోడ్​తో వెళ్తున్న లారీ.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నటరాజ్ చౌరస్తాలో డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు టైర్లు డివైడర్​ పైకి ఎక్కాయి. ఈ ప్రమాదంలో లారీలోని మేకలు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్ నుంచి 200 మేకల లోడ్​తో హైదరాబాద్​ వెళ్తుండగా జగిత్యాలలోని నటరాజ్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డుకు అడ్డంగా లారీ ఉండటం వల్ల కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్​ను క్లియర్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details