దంతాలపల్లి మండలం గున్నేపల్లికి కొందరు కుటుంబ సభ్యులు నెల్లికుదురు మండలం శ్రీ రామగిరిలో జరిగే శుభకార్యానికి ఆటోలో బయలుదేరారు. దంతాలపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న లారీ... వీరు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టింది.
ACCIDENT: ఆటోను ఢీకొట్టిన లారీ.. తొమ్మిది మందికి గాయాలు - మహబూబాబాద్ జిల్లా వార్తలు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి శివారులో ఓ ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆటో రోడ్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.
ఈ ఘటనతో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పింది. పక్కనున్న రోడ్ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి మహబూబాబాద్‌లోని ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీచూడండి:Accident : వధువును తీసుకెళ్తుండగా ప్రమాదం... నలుగురు మృతి