Road Accident: ఎన్నికల ప్రచారానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. - తెలంగాణ నేర వార్తలు
15:56 October 26
Road Accident: ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తెరాస ఎన్నికల ప్రచార కోసం ఆటో ట్రాలీలో 20 మంది హుజురాబాద్ వస్తున్నారు. ఇందిరానగర్ నుంచి హుజురాబాద్ వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన లారీ ఆటోట్రాలీని ఢీకొట్టింది.
ఘటనలో ఆటోట్రాలీ డివైడర్‌ను ఢీకొట్టండం వల్ల అందులో ప్రయాణిస్తున్న 20 మందిలో ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులను... తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్వయంగా అంబులెన్స్‌లో ఎక్కించారు. వారి చికిత్సకు అయ్యే వైద్య ఖర్చులను తామే భరిస్తామని భరోసా కల్పించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఇదీ చూడండి:Fire Accident: కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం.. 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధం