ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన గట్ల రమాదేవి, ఆమె భర్త లక్ష్మయ్య, కొడుకు సత్యనారాయణతో కలిసి మహబూబాబాద్‌లోని దంతాలపల్లిలో జరిగే ఓ కార్యక్రమానికి ఆటోలో బయలుదేరారు. ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరగానే... వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు.
ఆటోను ఢీకొన్న లారీ... మహిళ మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు
మహబూబాబాద్ జిల్లాలోని ఎల్లంపేట వద్ద ఆటోను లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మృతురాలి భర్తకు, కొడుకు గాయాలు కాగా... వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆటోను ఢీకొన్న లారీ... మహిళ మృతి
ఈ ఘటనలో డ్రైవర్, భర్త, కొడుకుకు గాయలయ్యాయి. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భిక్షపతి తెలిపారు.
ఇదీ చూడండి:మాస్క్ ధరించని ట్రాఫిక్ పోలీసుకు జరిమానా