హైదరాబాద్ చింతల్‌లోని మాంగళ్య షాపింగ్ మాల్ వద్ద రోడ్ ప్రమాదం జరిగింది. ఉదయం 4 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్ రాయిపూర్ నుంచి ఇనుప చువ్వల లోడ్‌తో వస్తున్న లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ - తెలంగాణ వార్తలు
లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ చింతల్లో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:JEE MAINS: జేఈఈ మెయిన్స్ ర్యాంకులతోనే.. ఐఐటీల్లో ప్రవేశాలు మేలు