సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బాహ్యవలయ రహదారిపై దారుణం జరిగింది. వెనుక వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్‌ను కిరాతకంగా కొట్టి చంపారు (lorry driver murder). నిందితులను పోలీసులు రాత్రికి రాత్రే పట్టుకున్నారు.
ఏపీలోని కృష్ణాజిల్లా తాడేపల్లికి చెందిన అనిల్... సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం నాగులపల్లిలోని స్టీల్ కంపెనీ నుంచి లారీలో స్టీల్లోడు వేసుకుని బెంగళూరుకు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి డీసీఎంలో వచ్చిన ఇద్దరు... లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం లారీని దాటొచ్చి డీసీఎంను అడ్డంగా నిలిపి లారీ డ్రైవర్ అనిల్‌తో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి ఇనుప రాడ్‌తో అనిల్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.