తెలంగాణ

telangana

ETV Bharat / crime

కల్వర్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి - డ్రైవర్ అక్కడికక్కడే మృతి

ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్​ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

lorry accident news, pandilla siddipet accident news
కల్వర్టును ఢీకొట్టిన లారీ.. డ్రైవర్ మృతి

By

Published : Apr 7, 2021, 11:28 AM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులో కాళేశ్వరం నుంచి సంగారెడ్డి వైపు ఇసుక లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీతో కల్వర్టుకు ఢీ కొట్టడం వల్ల లారీ టైరు పగిలి అక్కడికక్కడే బోల్తా పడింది.

వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది లారీ డ్రైవర్​ను బ్రతికించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. లారీ బోల్తా పడిన సమయంలో సమీపంలో ఎలాంటి వాహనాలు, బాటసారులు లేకపోవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. డ్రైవర్ బిహార్​కు చెందిన మిథిలేష్​గా గుర్తించారు.

ఇదీ చూడండి :ఆలయంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీ

ABOUT THE AUTHOR

...view details