భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో లారీ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంటి బయట ఎవరూ లేక పోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బీపీఎల్ క్రాస్ రోడ్డు వద్ద మణుగూరు- కొత్తగూడెం- భద్రాచలం రహదారుల జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ - Telangana news
ఓ ఇంట్లోకి లారీ దూసుకెళ్లిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడమే కారణమని తెలుస్తోంది.
![ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ lorry crashed into a house in Bhadradri Kottagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:05:51:1622777751-tg-kmm-13-03-intloki-dhusukellina-lorry-av-ts10042-03062021214028-0306f-1622736628-505.jpg)
lorry crashed into a house in Bhadradri Kottagudem district
లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:నిషేధిత పత్తి విత్తనాల విక్రయ ముఠా అరెస్ట్