తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెట్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్, క్లీనర్ మృతి

కామారెడ్డి జిల్లా మల్లయపల్లి సమీపంలో చెట్టును లారీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు.

accident road accident ,
చెట్టును ఢీకొన్న లారీ, రోడ్డు ప్రమాదం

By

Published : Jun 5, 2021, 10:33 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయపల్లి గేటు సమీపంలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. లారీలో ఉన్న ఇనుప పైపులు క్యాబిన్​లో​కి దూసుకురావడంతో డ్రైవర్, క్లీనర్ క్యాబిన్​లోనే చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే క్లీనర్ మృతి చెందగా.. డ్రైవర్ కొన ఊపిరితో ఉన్నారు.

కొద్దిసేపు తర్వాత డ్రైవర్ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మృతులు మహారాష్ట్రలోని లాహుర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తిచారు.

ఇదీ చదవండి:కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృతి

ABOUT THE AUTHOR

...view details