తెలంగాణ

telangana

ETV Bharat / crime

అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్ - అగ్గిపెట్టెల లారీలో మంటలు

Lorry catches fire in vishakapatnam: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లారీ దగ్ధమైంది. తమిళనాడు నుంచి బిహార్ వెళ్తున్న అగ్గిపెట్టెల లారీని.. ఎదురుగా వస్తున్న వాహనం తాకుతూ వెళ్లటంతో ప్రమాదం చోటు చేసుకుంది.

LORRY FIRE
LORRY FIRE

By

Published : Mar 18, 2022, 2:24 PM IST

Lorry catches fire in vishakapatnam: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల లారీ దగ్ధమైంది. తమిళనాడు నుంచి బిహార్ వెళ్తున్న అగ్గిపెట్టెల లారీని.. ఎదురుగా వస్తున్న వాహనం తాకుతూ వెళ్లింది. ఈ రాపిడికి మంటలు చెలరేగాయి. లోపల మొత్తం అగ్గిపెట్టెలు ఉండడంతో.. క్షణాల్లో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి.

అగ్గిపెట్టెల లారీ దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్


లారీ డ్రైవర్, క్లీనర్‌ అప్రమత్తమై కిందకుదిగి.. ప్రాణాలు కాపాడుకున్నారు. లారీ మాత్రం పూర్తిగా కాలిపోయింది. పెందుర్తి- ఆనందపురం ప్రధాన రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించగా.. పోలీసులు చక్కదిద్దారు.

ఇదీ చూడండి:harassment on women: నగ్నంగా వీడియో కాల్‌ చేస్తావా..లేదా!

ABOUT THE AUTHOR

...view details