Lorry Bolta in Bhadradri : వరినాట్లు వేసేందుకు వెళ్తున్న కూలీల వాహనాన్ని .. బొగ్గు లారీ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లెలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారు.
కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బొగ్గు లారీ బోల్తా.. నలుగురు మృతి - lorry bolta in kothagudem

12:35 January 28
Lorry Bolta in Bhadradri : వాహనాన్ని ఢీకొట్టి బొగ్గు లారీ బోల్తా.. నలుగురు మృతి
Lorry Bolta in thippanapalli : సుజాత నగర్‌కు చెందిన సుమారు 12 మంది ఓ ట్రక్‌లో వరినాట్లు వేసేందుకు సత్తుపల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం వెళ్తున్న బొగ్గులారీ వీరి వాహనాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు కత్తి స్వాతి, సుజాత, లక్ష్మీ(43), సాయమ్మ(45) లను కొత్తగూడెం సమీపంలోని సుజాతనగర్ వాసులుగా గుర్తించారు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది.
10:33 January 28