సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును.. మల్లారం స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ దాటి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
డివైడర్ దాటొచ్చి కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం - మల్లారంలో రోడ్డు ప్రమాదం
![డివైడర్ దాటొచ్చి కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం siddipet road accident today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15538849-thumbnail-3x2-a.jpg)
siddipet road accident today
11:03 June 12
సిద్దిపేట జిల్లా మల్లారం వద్ద లారీ కారు ఢీ.. ముగ్గురు మృతి
Last Updated : Jun 12, 2022, 12:06 PM IST