హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం తోళ్లు తరలిస్తున్న లారీ బోల్తా పడింది.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలకు అంతరాయం - telangana varthalu
హైదరాబాద్-విజయవాడ రహదారిపై బుధవారం సాయంత్రం లారీ బోల్తాపడింది. నిన్న సాయంత్రం నుంచి రహదారిపైనే లారీ ఉంది. దానిని తొలగించకపోవడం వల్ల వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
లారీ బోల్తా.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం
నిన్న సాయంత్రం నుంచి రహదారిపైనే లారీ అలాగే ఉంది. ఇవాళ లారీని పక్కకు తొలగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఓ వైపు వర్షంతో జనాలు ఇబ్బందిపడుతుండగా.. లారీ బోల్తా పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి: YADADRI: యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు