భాజపా నేత ఇంట్లో కిడ్నాప్ కలకలం.. డ్రైవర్ సహా నలుగురి అపహరణ - jitender reddy latest news
18:51 March 01
భాజపా నేత డ్రైవర్ సహా నలుగురు కిడ్నాప్
మాజీ ఎంపీ, భాజపా నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురిని అపహరించినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దిల్లీ సౌత్ అవెన్యూలోని నం.105 నివాసం నుంచి జితేందర్ రెడ్డి డ్రైవర్ సహా నలుగురిని బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ మేరకు దిల్లీ సౌత్ అవెన్యూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జితేందర్ రెడ్డి డ్రైవర్ సహా నలుగురిని తీసుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఫిర్యాదు అందుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వారి ఫోన్ రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు. వీరిని తీసుకెళ్లింది ఎవరు? ఎందుకు చేశారు అనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.