ప్రేమించాలని వేధిస్తూ బీటెక్ విద్యార్థి ఎయిర్ గన్‌తో హల్‌చల్ చేసిన ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి ప్రేమ వేధింపులకు గురిచేసేవాడు. గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో సందేశాలు పంపుతూ వేధించేవాడు.
ప్రేమించాలని ఎయిర్‌గన్‌తో బెదిరింపులు - ఎయిర్‌గన్‌తో ప్రేమ వేధింపులు
ప్రేమ వేధింపులకు గురి చేస్తూ ఎయిర్‌గన్‌తో ఓ యువతిని బెదిరించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.
దమ్మాయిగూడలోని సాయిబాబా నగర్‌కు చెందిన అభిషేక్ గత కొన్ని రోజులుగా ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. శుక్రవారం సాకేత్ టవర్స్ వద్ద ఆమె తన సోదరుడితో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అభిషేక్ వారి వద్దకు వచ్చి ఎయిర్ గన్‌తో బెదిరించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించి వారిపై దాడికి పాల్పడటానికి వచ్చిన యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:మెడికల్ సీటు ఇప్పిస్తాంటూ రూ.1.23 కోట్లకు టోకరా..