Cow Attack on Old Woman Live Video : ఆవుకు చిర్రెత్తుకొచ్చింది.. వృద్ధురాలిని ఎత్తి కుదేసింది! - cow attack on a old woman in jawahar nagar
13:48 October 23
Cow Attack on Old Woman Live Video : జవహర్‌నగర్‌లో వృద్ధురాలిపై ఆవు దాడి
మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో వృద్ధురాలిపై ఆవు దాడి చేసింది. పోచమ్మ అనే వృద్ధురాలు బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆవు ఒక్కసారి దాడి చేసి... ఆమెను ఎత్తిపడేసింది.
కొమ్ములతో కడుపులో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- ఇదీ చదవండి : చదువుకునేందుకు డబ్బులు లేకే చనిపోతున్నా..