తెలంగాణ

telangana

ETV Bharat / crime

Liquor Seized తిరుమలలో అక్రమ మద్యం పట్టివేత - telanagana latest news

Liquor Seized తిరుమలలో నిషేధిత వస్తువులు తీసుకురాకుడదనే నియమం అమల్లో ఉన్నా కొందరు అక్రమార్కులు వాటిని దర్జాగా తరలించి అక్కడ అమ్ముకుంటున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న కొందరు వారి కళ్లు కప్పి దొంగతనంగా రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు.

liquor
liquor

By

Published : Aug 22, 2022, 7:08 PM IST

Liquor Seized తిరుమలలో నిషేధిత వస్తువులపై ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అక్రమార్కులకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ రోజు తిరుమలలో 13 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని సరఫరా చేస్తున్నఓ వ్యక్తిని అరెస్టు చేశారు. సప్తగిరి అతిథి గృహం వద్ద మద్యం సరఫరా చేస్తున్న శ్రీరాములు అనే వ్యక్తి నుంచి 13 మద్యం సీసాలను తిరుమల ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు శ్రీరాములు అనే వ్యక్తిని, తిరుమల రెండో పట్టణ పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు. తిరుమలకు నిషేధిత వస్తువులను రవాణా చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details