తెలంగాణ

telangana

ETV Bharat / crime

కిరాణా దుకాణంలో ఆబ్కారీ అధికారుల తనిఖీలు.. మద్యం సీజ్ - తెలంగాణ వార్తలు

కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 మద్యం సీసాలను సీజ్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని అన్నారు.

liquor seized in sangareddy, excise police inspections
గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారుల దాడులు, గుమ్మడిదలలో మద్యం సీజ్

By

Published : May 12, 2021, 10:17 PM IST

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారులు దాడులు జరిపి... ఓ కిరాణా దుకాణంలో విక్రయిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి తన కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై వెంకటేశ్ అన్నారు.

ఈ దాడుల్లో 250 మద్యం సీసాలను స్వాధీనం చేసినట్లు తెలిపారు. కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వఉంచి విక్రయిస్తున్నందున సాయికుమార్ గౌడ్ పై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కూకట్​పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details