తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - నిర్మల్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని నిర్మల్​ జిల్లా మామడ పోలీసులు పట్టుకున్నారు. రూ. 13, 400 విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం

By

Published : May 15, 2021, 7:35 PM IST

నిర్మల్ జిల్లా మామడ మండలం అనంతపేట్​లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మంద శ్రీనివాస్ గౌడ్ తన ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అధిక ధరకు అమ్ముతున్నారన్న సమాచారంతో శనివారం పోలీసులు దాడి చేశారు.

అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 13,400 విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎస్సై వినయ్ తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'తొమ్మిదేళ్లుగా విధుల్లో భార్యకు బదులు భర్త'.. కలెక్టర్​కు ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details