తెలంగాణ

telangana

ETV Bharat / crime

Leopard : అనగనగా ఓబుళాపురం.. అక్కడ చిరుతపులి.. దానికి మూడు పిల్లలు! - ఓబుళాపురంలో చిరుతపులి

ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మండలం సీసంగుంతల, ఓబుళాపురం కొండల్లో చిరుతపులి(Leopard) సంచారం చేస్తోందని అధికారులు గుర్తించారు. ఓ మేకను చంపిందని...గ్రామస్థులందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ పోలీసులు సూచించారు. ఈ క్రమంలో గ్రామంలో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

అనగనగా ఓబుళాపురం.. అక్కడ చిరుతపులి..దానికి మూడు పిల్లలు!
అనగనగా ఓబుళాపురం.. అక్కడ చిరుతపులి..దానికి మూడు పిల్లలు!

By

Published : Aug 1, 2021, 11:40 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం గ్రామ సమీపంలో కనుమ కింద కొండ ప్రాంతంలో చిరుతపులి(Leopard) సంచరిస్తోంది. సీసంగుంతల గ్రామానికి చెందిన మేకను పులి చంపేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు.. పరిశీలించగా పులి జాడలు కనిపించాయి. అక్కడ ఆడపులి ఉందని దానికి మూడు పిల్లలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

చిరుత సంచారంతో సీసంగుంతల గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొండల్లో పరిశీలించిన అటవీశాఖ అధికారులు, కొండల్లోకి వెళ్లొద్దంటూ గ్రామాల్లో దండోరా వేయించారు. గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details