తెలంగాణ

telangana

ETV Bharat / crime

ధర్మాపూర్​ గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి - తెలంగాణ వార్తలు

మహబూబ్​నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

leopard-assaulted-on-calf-at-dharmapur-in-mahabubnagar-district
ధర్మాపూర్​ గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి

By

Published : Feb 28, 2021, 5:57 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని ఊటకుంట వద్ద చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ధర్మాపూర్ గ్రామానికి చెందిన పసుల నరేందర్ వ్యవసాయ పొలంలో ఉన్న లేగ దూడపై చిరుత దాడి చేసింది. కొన్ని రోజులుగా సమీప ప్రాంతాల్లో చిరుతను చూశామని రైతులు చెబుతున్నారు. పశువులపై దాడి చేసిన ఘటనలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

ఈ ఘటనతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పశువులను పొలాల వద్ద ఉంచకూడదని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

ఇదీ చదవండి:ఎప్పుడూ ఆమె ఆలోచనలే.. నాలో తప్పులు వెతుకుతాడు.. ఏం చేయాలి?

ABOUT THE AUTHOR

...view details