తెలంగాణ

telangana

ETV Bharat / crime

'ఆ చట్టాలు రైతుల పాలిట వరాలు కాదు... మరణ శాసనాలు' - hyderabad district latest news

దిల్లీలో సాగుతున్న రైతాంగ ఉద్యమం ఏడు నెలలు పూర్తైన సందర్భంగా ఇందిరా పార్కు వద్ద అఖిలపక్ష రైతు సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు రైతుల పాలిట వరాలు కాదు... మరణ శాసనాలని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆరోపించారు. వెంటనే చట్టాలను రద్దు చేయాలని కోరారు. 'చలో రాజ్‌భవన్‌'కు బయలుదేరిన రైతుసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ఇందిరాపార్కు వద్ద నిరసన
ఇందిరాపార్కు వద్ద నిరసన

By

Published : Jun 26, 2021, 3:13 PM IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాల రద్దుతో పాటు విద్యుత్ బిల్లు ఉపస‌హరించుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష రైతుసంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి రైతులకు సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో సాగుతున్న రైతాంగ ఉద్యమం ఏడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్‌కేఎం, ఏఐకేఎస్‌సీసీ సంయుక్త పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళన చేపట్టారు.

చలో రాజ్‌భవన్‌కు బయలుదేరిన రైతుసంఘాల నేతలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలు రైతుల పాలిట వరాలు కాదు... మరణ శాసనాలని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ఆరోపించారు. నల్ల సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు నుంచి 'చలో రాజ్‌భవన్‌'కు బయలుదేరిన రైతుసంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతు సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నారాయణ మూర్తిసహా రైతు సంఘాల నేతలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:'రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తాం'

ABOUT THE AUTHOR

...view details