తెలంగాణ

telangana

ETV Bharat / crime

KIDNAP: కిడ్నాప్ కేసులో బాధితుడిని వదిలేసిన దుండగులు - హైజరాబాద్ కిడ్నాప్ వార్తలు

lb-nagar-kaif-traders-wood-owner-kidnap-case
కిడ్నాప్ కేసులో బాధితుడిని వదిలేసిన దుండగులు

By

Published : Jul 3, 2021, 8:31 AM IST

Updated : Jul 3, 2021, 10:09 AM IST

08:20 July 03

అర్ధరాత్రి సామగ్రిని దోచేసి.. యజమానిని ఎత్తుకెళ్లిన దుండగులు

          హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో కిడ్నాప్​కు గురైన టింబర్ డిపో యజమాని ఆచూకీ లభించింది. రాత్రి పూటే ఆరిఫ్ అక్బర్​ని మేడ్చల్​లో వదిలివేయగా... అతను నేరుగా నాగపూర్​ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.  

సీసీ కెమెరాలను ఆఫ్ చేసి.. ఆపై దోచేసి

     శుక్రవారం అర్ధరాత్రి కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని ఆరిఫ్‌ అక్బర్‌ని పది మంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి తీసుకెళ్లారు. అంతకుముందే సీసీ కెమెరాలను ఆఫ్ చేసిన దుండగులు... దుకాణంలో ఉన్న లక్షల విలువైన కలపను డీసీఎం వ్యాన్‌తో సహా ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్​కి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.  

ఇదీ చూడండి:బొమ్మల తయారీ పరిశ్రమలతో ఉపాధి కల్పన

Last Updated : Jul 3, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details