రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీలో రూ. 9 లక్షలతో ఏర్పాటు చేసిన 57 సీసీ కెమెరాలను ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 60 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. దొంగతనాలు జరగకుండా ఉండడానికి ప్రతీ ఒక్కరు వారి కాలనీల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: డీసీపీ సంప్రీత్ సింగ్
దొంగతనాలు జరగకుండా ఉండడానికి ప్రతీ ఒక్కరు వారి కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎల్బీనగర్ డీసీపీ సూచించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 60 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రతీ కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి: ఎల్బీనగర్ డీసీపీ
జాతీయ రహదారితో పాటు.. హయత్ నగర్లో కూడా ఇప్పటివరకు చాలా కెమెరాలు ఏర్పాటు చేశామని డీసీపీ వెల్లడించారు. మైత్రి శ్రీపురం కాలనీలో రూ. 9 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇతర కాలనీ వాసులు వీరిని ఆదర్శంగా తీసుకొని కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:రెవెన్యూ అధికారుల ఎదుటే రైతుల ఆత్మహత్యాయత్నం