తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఘరానా దొంగలు.. రూ. లక్షల్లో ఆభరణాలు, వస్తువులు చోరీ - అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన ఎల్బీనగర్​ సీసీఎస్​ పోలీస్​

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్​ సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు, ఎలక్రానిక్​ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

thieves arrest by lb nagar ccs police
ఎల్బీనగర్​లో అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్​

By

Published : May 17, 2021, 6:51 PM IST

హైదరాబాద్​లోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14 లక్షల 36 వేల విలువ చేసే 18 తులాల బంగారు ఆభరణాలు, కిలోకు పైగా వెండి వస్తువులు, ఒక ల్యాప్‌టాప్‌, ఓ ట్యాబ్‌, రెండు ద్విచక్ర వాహనాలు, 5 గడియారాలు, ఓ టీవీ, కెమెరా స్వాధీనం చేసుకున్నామని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

రోజువారి తనిఖీల్లో భాగంగా ఎల్బీనగర్‌లో వాహనాల తనఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు కిషోర్ చౌదరి, అర్జున్ సింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఆదిభట్ల, మీర్‌పేట పోలీసు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లోనూ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు

ABOUT THE AUTHOR

...view details