హైదరాబాద్ చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి గతంలో వాయుసేనలో పనిచేసి పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు.
చిక్కడపల్లిలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని లాయర్ సూసైడ్ - తెలంగాణ తాజా నేర వార్తలు
20:28 July 22
చిక్కడపల్లిలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని లాయర్ సూసైడ్
బంధువులు ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:ప్రియురాలి తల నరికి.. స్టేషన్కు తీసుకెళ్లిన యువకుడు.. అందుకు ఒప్పుకోలేదనే!
SC on Kaleshwaram: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు..