Bus fire accident in Hyderabad: పార్కింగ్‌లో ఉన్న బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో సమీపంలో ఉన్న స్థానికులు వచ్చి మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. అయిన మూడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన హైదరాబాద్ జిల్లాలోని కూకట్‌పల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు సమీపంలో అర్ధరాత్రి పార్కింగ్ చేసి ఉన్న బస్సుల్లో విద్యుత్ఘాతం వలన ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి మంటలను అర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు ఎంత ప్రయత్నించిన కొంత సమయం వరకు మంటలు అదుపులోకి రాలేదు.
అర్ధరాత్రి అగ్ని ప్రమాదం.. మూడు బస్సులు దగ్ధం - hyderabad latest news
Bus fire accident in Hyderabad: అర్ధరాత్రి హైదరాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వలన మూడు ప్రైవేట్ బస్సులు కాలిపోయాయి. మరో నాలుగు బస్సులను స్థానికుల సహాయంతో మంటల్లో కాలిపోకుండా చేశారు.
అప్పటికి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినందున మూడు బస్సులు దగ్ధమయ్యాయి. మరో నాలుగు బస్సులను అక్కడి నుంచి వేరే చోటికి స్థానికులు తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న బస్సులు భారతి ట్రావెల్స్‌కు చెందినవిగా భావిస్తున్నారు. జరిగిన ప్రమాదం విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు స్పందించి దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం విద్యుత్ఘాతం వలన జరిగిందా లేదా సహజంగానే జరిగిందా లేదా ఇతర ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: