వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో భర్త అక్కడికక్కడే మరణించగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ముత్తిరెడ్డిపల్లికి చెందిన భర్యాభర్తలు విష్ణు సాగర్(50), సుజాత బంధువులకు ఆరోగ్యం బాలేదు. దీంతో వారు రామకృష్ణాపురంలో ఉన్న స్వామీజీ వద్దకు ఆరుగురు మూడు బైక్‌లపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మిరాసిపల్లి వద్ద రెండు ద్విచక్రవాహనాలు ముందు వెళ్లగా.. విష్ణుసాగర్, సుజాత వెళ్తున్న బైక్ రోడ్డు దాటుతుండగా కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ వారిని ఢీ కొట్టింది.
లారీ ఢీ.. భర్త మృతి, భార్యకు గాయాలు - wanaparthy district crime news
ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్య, భర్తలను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వనపర్తి జిల్లా మిరాసిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
లారీ ఢీ.. భర్త మృతి, భార్యకు గాయాలు
ప్రమాదంలో బైక్ లారీ కిందకు దూసుకెళ్లింది. విష్ణుసాగర్ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య సుజాత కాలుకు తీవ్ర గాయం కావడంతో చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి :సాయంత్రం 5 తర్వాత బేగం బజార్ బంద్