Road accident at bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బస్ డిపో సమీపంలో ప్రధాన రహదారిపై లారీ ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకి తీవ్రగాయాలు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరు పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులుగా గుర్తించారు. మృతుడు గణేష్, క్షతగాత్రుడు అక్షిత్ కుబీర్ గ్రామానికి, మరో విద్యార్థి శ్రీనివాస్ భైంసాలోని రాహుల్ నగర్‌కు చెందిన వారుగా తెలిపారు.