తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2021, 9:07 PM IST

ETV Bharat / crime

GANJA SEIZED: భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

భద్రాచలంలో భారీ మొత్తంలో(GANJA SEIZED) గంజాయి పట్టుబడింది. ముగ్గురు యువకులు ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల విలువ రూ.40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

GANJA SEIZED, GANJA SEIZED at bhadrachalam
గంజాయి పట్టివేత, భద్రాచలంలో గంజాయి సీజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద 200 కేజీల గంజాయి(GANJA SEIZED)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.40లక్షలు ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

నిందితులు సమదాన్, విక్రమ్, గణేష్ మహారాష్ట్ర ఒస్మానాబాద్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కారుతో పాటు గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో 24 గంటలూ తనిఖీలు జరుగుతుంటాయని తెలిపారు. నిషేధిత వస్తువులను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టి.స్వామి, ఎస్.మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:CORONA: కరోనా వేళ తైలాల పేరుతో రూ.52 లక్షల మోసం

ABOUT THE AUTHOR

...view details