నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్‌బిడ్‌లో ఓ భూవివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన సాయన్న, చిన్నసాయిరెడ్డి మధ్య ఓ భూమి విషయంలో వివాదం నెలకొంది. భూమి తమదంటే తమదని ఇరువర్గాలు గొడవ పడతున్నాయి.
భూ వివాదం.. ఘర్షణకు దిగిన రెండు కుటుంబాలు - ఒకరిపై ఒకరు దాడి
భూ వివాదం రెండు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. ఆ భూమి తమదంటే తమని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఎడిబిడ్ గ్రామంలో జరిగింది.
రెండు కుటుంబాల మధ్య గొడవకు దారితీసిన భూవివాదం
శనివారం మరోసారి ఇరుకుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో సాయన్న కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని గ్రామస్థులు భైంసా ఆస్పత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించగా..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మాజీ మంత్రి ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎంకు ఫిర్యాదు