కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కబ్జాదారులు ఇదే అదునుగా విలువైన భూములను కబ్జా చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లోని సర్వే నంబర్ 25/1 లో అతి పెద్ద క్వారీ ఉంది. దీనిని కొద్ది రోజుల నుంచి కొందరు కబ్జా చేసేందుకు ఆ క్వారీలో మట్టి, రాళ్లతో నింపుతున్నారు.
గమనించిన వీఆర్వో బాలరాజు.. కబ్జాదారులను హెచ్చరించారు. అయినా అదే పనిగా కొనసాగిస్తుండగా... కొండయ్య, లక్ష్మయ్య, వెంకటయ్య, నర్సింహ, కృష్ణ అనే ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ.. వీఆర్వో స్థానిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.