VIRAL VIDEO: యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టాదారులకు, ఇంటి యజమానుల మధ్య వివాదం చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువులో 70 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లు తమ స్థలంలో ఉన్నాయంటూ ఇరువురి మధ్య గొడవ జరుగుతుంది. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్‌కుమార్ వచ్చి భూమిని పరిశీలించారు. 15రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. ఆయన వెళ్లిన తర్వాత మళ్లీ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో కర్రలతో పరస్పరం దాడిచేసుకున్నారు. దీంతో విషయం తెలుసకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
'భూ వివాదంలో కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు' - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా నేర వార్తలు
VIRAL VIDEO: యాదాద్రి భువనగిరి జిల్లాలో భూవివాదం చోటుచేసుకుంది. తమ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారని భూమి పట్టాదారులు, ఇంటి యజమానుల మధ్య గొడవ నెలకొంది. దీంతో మాట మాట పెరిగి పరస్పరం ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు.
భూవివాదం