ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / crime

భూ వివాదం.. గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఇరు కుటుంబాలు - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా నేర వార్తలు

LAND DISPUTE: వరంగల్ గ్రామీణ జిల్లాలో తలెత్తిన ఓ భూ వివాదం ఏడుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ భూమి కోసం... నాదంటే నాది అని... మహిళలు, పురుషులు, గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి.

భూ వివాదం
భూ వివాదం
author img

By

Published : Jun 25, 2022, 3:32 PM IST

LAND DISPUTE: ఓ భూ వివాదం రెండు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. ఆ భూమి తమదంటే తమని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండాలో చోటుచేసుకుంది. సూర్యతండాకు చెందిన బానోత్‌ శ్రీనివాస్‌, బీలు నాయక్‌ మధ్య.. కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తోంది. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈవిషయంలో రెండు కుటుంబాల మధ్య పంచాయితీ జరుగుతుంది.

ఈ క్రమంలో బానోత్ శ్రీనివాస్ ఇంటిపై బీలునాయక్ కుటుంబ సభ్యులు గొడ్డళ్లు, ఇనుపరాడ్లు, కర్రలతో దాడికి దిగారు. మంజుల అనే 8 నెలల గర్భిణీ సహా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. తమను రక్షించాలని శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు రాయపర్తి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

భూ వివాదంలో గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసుకున్న ఇరుకుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details