కూలీ పని చూపిస్తానని వెంట తీసుకెళ్లి ఓ మహిళను హత్య చేసిన వ్యక్తిని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన వెంకటేశ్... గోల్కొండలో గుంపు మేస్త్రిగా పనిచేస్తున్నాడు. మణికొండ కూలీల అడ్డా దగ్గర ఉండే కూలీలను తీసుకెళ్లి ఇంటి నిర్మాణ పనులు చేయిస్తుంటాడు.
ఈనెల 9న చెన్నమ్మ అనే మహిళను కూలీ పేరుతో వెంట తీసుకెళ్లాడు. రాయదుర్గంలోని కల్లు కంపౌండ్‌లో కల్లు తీసుకొని షేక్‌పేటలోని నిర్మానూష్య ప్రాంతానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. కల్లు సేవించిన అనంతరం మత్తులో ఉన్న చెన్నమ్మ తలపై వెంకటేశ్ రాయితో మోదాడు. చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత ఆమె కాళ్లకు ఉన్న కడియాలు, చెవి కమ్మలను తీసుకెళ్లాడు.