తెలంగాణ

telangana

ETV Bharat / crime

మాజీ ప్రియుడిపై డ్యాన్సర్​ ఫిర్యాదు.. ఏకాంతంగా గడిపిన వీడియో బయటికొచ్చిందని..! - మాజీ ప్రియుడిపై డ్యాన్సర్​ ఫిర్యాదు

lady dancer complaint on ex lover: మాజీ ప్రియుడిపై ఓ మహిళా డ్యాన్సర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం వాళ్లిద్దరు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రహస్యంగా వీడియో తీశాడని ఇప్పుడు ఫిర్యాదు చేసింది. అసలు.. అప్పుడెప్పుడో వాళ్లిద్దరు సన్నిహితంగా ఉ్నన్నప్పుడు వీడియో తీశాడని ఇప్పుడు బాధితురాలికి ఎలా తెలిసిందంటే..?

lady dancer complaint on ex lover for recorder video of their private time
lady dancer complaint on ex lover for recorder video of their private time

By

Published : Jun 1, 2022, 5:00 PM IST

lady dancer complaint on ex lover: మద్యం మత్తులో ఏకాంతంగా గడిపిన క్షణాలను రహస్యంగా రికార్డ్ చేసి.. స్నేహితులకు పంపాడని మాజీ ప్రియుడిపై ఓ డాన్సర్ ఫిర్యాదు చేసింది. బంగాల్​కు చెందిన మహిళా డ్యాన్సర్​కు ఓ ఈవెంట్​లో మహారాష్ట్రకు చెందిన సచిన్ అనే ఫిట్​నెస్ ట్రైనర్ పరిచయమయ్యాడు. వారి మధ్య ఏర్పడ్డ స్నేహం కాస్తా.. ప్రేమగా మారింది. 2014 నుంచి ఇద్దరు ప్రేమించుకున్నారు. చాలా కాలం వరకు వారి ప్రేమాయణం బాగానే నడిచింది. రానురాను యువతిని సచిన్​ శారీరకంగా వేధించటం మొదలుపెట్టాడు.

సచిన్ ప్రవర్తన నచ్చకపోవటంతో.. కొన్నేళ్లుగా యువతి సచిన్​కి దూరంగా పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటోంది. కాగా.. రెండేళ్ల క్రితం పంజాగుట్టలోని ఆమె నివాసానికి సచిన్ వచ్చాడు. ఆమెతో కలిసి మద్యం సేవించాడు. మత్తులో ఇద్దరు ఏకాంతంగా గడిపారు. వాళ్లు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఆమెకు తెలియకుండా చరవాణిలో రికార్డ్ చేశాడు. మళ్లీ.. అప్పటి నుంచి ఇద్దరు విడిగానే ఉంటున్నారు.

అయితే.. సచిన్​తో​ ఏకంతంగా గడిపిన వీడియోలు తాజాగా సదరు యువతి స్నేహితుల వద్దకు చేరాయి. ఆ వీడియోల గురించి తెలిసి వెంటనే సచిన్​కు ఫోన్​ చేయగా.. స్పందన లభించలేదు. ఇక చేసేదేమీలేక.. సచిన్​పై పంజాగుట్ట ఠాణాలో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సచిన్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details