క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందంటూ సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ వ్యక్తి మోసపోయిన ఘటన హైదరాబాద్ చింతల్లో జరిగింది. జీడిమెట్ల పీఎస్ పరిధి చింతల్‌కు చెందిన కిషోర్‌కు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందంటూ ఓ మహిళ ఫోన్ చేసింది. ఆఫర్ తనకు అవసరం లేదంటూ మహిళకు కిషోర్ తెలిపాడు.
లేడీ ఫోన్ చేసింది.. రూ.98 వేలు కాజేసింది
భాగ్యనగరంలో ఓ వ్యక్తికి క్రెడిట్ కార్డు ఆఫర్ ఉందంటూ ఓ మహిళ ఫోన్ చేసింది. దీంతో ఆ వ్యక్తి సున్నితంగా తిరస్కరించాడు. మహిళ తన ఆఫర్‌ను డీయాక్టివేట్ చేయాలంటే అతని క్రెడిట్ కార్డు వివరాలు తెలపాలని కూపీ లాగింది. నమ్మిన అతను ఓటీపీతో సహా అన్ని వివరాలు చెప్పాడు. అంతే వెంటనే అతని ఖాతాలో నుంచి 98 వేల రూపాయలు డెబిట్ అయ్యాయి. మోసపోయానని నెమ్మదిగా తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
లేడీ ఫోన్ చేసింది.. రూ.98 వేలు కాజేసింది
తన ఆఫర్‌ను డీయాక్టివేట్ చేయాలంటే అతని క్రెడిట్ కార్డు వివరాలు చెప్పాలని కిషోర్‌ను సైబర్ మహిళ కోరింది. అది నమ్మి అతను క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ తెలిపాడు. దీంతో తన అకౌంట్ నుంచి రూ.98,000 మాయమయ్యాయి. మళ్లీ తనకు ఫోన్ చేయగా ఓటీపీ చెప్తా అని చీట్ చేసిందని బాధితుడు పేర్కొన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు కిశోర్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :కత్తులతో ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు