తెలంగాణ

telangana

ETV Bharat / crime

Road accident: కంటైనర్ ఢీకొని కార్మికుడు మృతి - Telangana news

రోడ్డు ప్రమాదంలో (Road accident) ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో.. ఓ కంటైనర్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Labor died in Road accident in sangareddy district
Labor died in Road accident in sangareddy district

By

Published : Jun 9, 2021, 2:02 PM IST

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ జాతీయ రహదారిపై ఓ కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో (Road accident) కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన పటాన్​ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలం పాలచర్ల గ్రామానికి చెందిన భీమ్ రెడ్డి(23) బ్రతుకుదెరువుకోసం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ వచ్చి నివాసం ఉంటున్నాడు. పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడుగా పని చేస్తున్నాడు.

మంగళవారం ఉదయం విధులకు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఎస్బీఐ సమీప జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా… సంగారెడ్డి వైపు నుంచి వస్తున్న కంటైనర్ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ కార్మికుడు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ఇదీ చూడండి: Covid: మూడో దశ సన్నద్ధతపై మోదీ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details