ఏపీకి చెందిన తెదేపా సీనియర్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్దకు చేరుకోగానే.. టైరు పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.
కారు టైరు పేలి ప్రమాదం.. మాజీ ఎంపీపీ మృతి.. - కర్నూలు మాజీ ఎంపీపీ మృతి న్యూస్
రాష్ట్రంలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. కారు టైరు పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.
![కారు టైరు పేలి ప్రమాదం.. మాజీ ఎంపీపీ మృతి.. kurnool-ex-mpp-died-in-road-accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15068267-90-15068267-1650456276276.jpg)
kurnool-ex-mpp-died-in-road-accident
రాజవర్థన్‌రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజవర్థన్‌రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: