constable rape attempt: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం - కానిస్టేబుల్ శేఖర్

16:49 December 01
constable rape attempt: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
రక్షించాల్సిన పోలీసు అధికారే.. రాక్షసుడిలా మారాడు. అభం శుభం తెలియని బాలికపై కీచకుడిలా మారి అఘాయిత్యం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుపొరుగు వారు వచ్చి ఆమెను కాపాడారు. లైంగిక దాడికి యత్నించిన పోలీసు కానిస్టేబుల్ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.
శంకర్పల్లి పట్టణానికి చెందిన శేఖర్ (35) నగరంలోని కూకట్‌పల్లి ఠాణాలో కానిస్టేబుల్. అతడి ఇంట్లో కొంత కాలంగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. బుధవారం సదరు కుటుంబానికి చెందిన బాలిక(15) ఇంట్లో ఒంటరిగా ఉంది. గమనించిన కానిస్టేబుల్ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించగా...కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
ఇదీ చూడండి :