ఆడుకుంటూ చెరువులో జారిపడి నలుగురు చిన్నారులు మృతి - చెరువులో జారిపడి నలుగురు చిన్నారులు మృతి
17:59 October 14
ఆడుకుంటూ చెరువులో జారిపడి నలుగురు చిన్నారులు మృతి
ఏపీలోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం వరహపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచినీటి చెరువు దగ్గర ఆడుకుంటున్న నలుగురు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందారు. దసరా సెలవులకు ఊరికి వచ్చిన పిల్లలు ఆడుకుంటూ చెరువులో పడటంతో గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో ఆసుపత్రిలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.
ఇదీ చదవండి:Intestinal Ulcer: కరోనా నుంచి కోలుకున్న వారిలో కలవరపెడుతున్న కొత్త సమస్య