తెలంగాణ

telangana

ETV Bharat / crime

తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్ అరెస్ట్

ఏపీలోని తాడేపల్లిలో జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆరీఫ్ నిందితుల అరెస్ట్ కోసం పోలీసులు చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు.

krishna-kishore-arrested-in-thadepalli-rape-case
krishna-kishore-arrested-in-thadepalli-rape-case

By

Published : Aug 7, 2021, 8:43 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కృష్ణ కిశోర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆరీఫ్ నిందితుల అరెస్ట్ కోసం పోలీసులు చాలా కష్టపడినట్లు పేర్కొన్నారు. జులై 19న రాత్రి అత్యాచార ఘటన జరిగిందన్న ఎస్పీ.. కృష్ణ కిషోర్​ను విజయవాడ రైల్వే ట్రాక్​పై పట్టుకున్నట్లు తెలిపారు. కృష్ణకిశోర్​కు సంబంధించిన ఆధారాలు దొరకడం ఆలస్యమైందన్న ఆయన.. అత్యాచారానికి ముందు ఒక వ్యక్తిని హత్య చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. రాగి తీగలు చోరీ చేయడం చూశాడని పల్లీలు అమ్మే వ్యక్తిని చంపి మృతదేహాన్ని నదిలో పడేశారని వెల్లడించారు.

హత్య తర్వాత కృష్ణా నది తీరంలో జంటను చూసిన కిశోర్.. యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితులపై చిల్లర చోరీలు, దాడులు చేసిన నేరాలు ఉన్నాయన్న ఎస్పీ..ఈ కేసులో మరో నిందితుడు ఇంకా పరారీలో ఉన్నట్లు స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details