తెలంగాణ

telangana

ETV Bharat / crime

అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై మట్టి మాఫియా దాడి - ఆర్​పై దాడి వార్తలు

ఏపీ కృష్ణా జిల్లాలో ఆర్​ఐపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకే ఆర్​ఐపై దాడి చేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా.... అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్​ఐ.అరవింద్ వాపోయారు.

అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై మట్టి మాఫియా దాడి
అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై మట్టి మాఫియా దాడి

By

Published : Apr 22, 2022, 7:28 AM IST


YSRCP followers attack: ఏపీ కృష్ణా జిల్లాలో అధికార వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఏకంగా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పైనే దాడికి తెగబడ్డారు. కొన్ని రోజుల నుంచి రాత్రివేళ అక్రమంగా మట్టి తవ్వుతున్నారనే సమాచారంతో.. రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆర్​ఐ అరవింద్‌ గుడివాడ మండలం మోటూరు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడ జేసీబీలతో మట్టి తవ్వుతున్నారు.

కృష్ణా జిల్లాలో ఆర్‌ఐపై మట్టి మాఫియా దాడి

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్​ఐ... తవ్వడానికి వీల్లేదంటూ జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో మీదికి వెళుతూ ఆయన్ను బెదిరించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆర్​ఐపై తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో.. మట్టి తవ్వకాలు ఆపేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్​ఐ అరవింద్ వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details