భవన నిర్మాణదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోన్న సీహెచ్.వెంకటసత్య వేణుగోపాల్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వేణుగోపాల్ మియాపూర్‌లో నివసిస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్ నగర్, అడ్డగుట్ట సొసైటీ తదితర ప్రాంతాల్లో భవన నిర్మాణదారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడు. నిర్మాణానికి సరైన అనుమతులు లేవని ఆయా భవనాలపై జీహెచ్ఎంసీ గ్రీవియెన్స్ సెల్, లోకాయుక్తలో ఫిర్యాదు చేయటం, ఆర్టీఐకు దరఖాస్తు చేయడం వంటి పనుల ద్వారా భవన యజమానులను, బిల్డర్లను బెదిరిస్తున్నాడు. పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసేవాడని సీఐ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
అనుమతులు లేవని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్
భవన నిర్మాణానికి సరైన అనుమతులు లేవని బెదిరించి.. వసూళ్లకు పాల్పడుతోన్న ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా భవనాలపై జీహెచ్ఎంసీ గ్రీవియెన్స్ సెల్, లోకాయుక్తలో ఫిర్యాదు చేయటం, ఆర్టీఐకు దరఖాస్తు చేయడం వంటి పనుల ద్వారా భవన యజమానులను, బిల్డర్లను బెదిరిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
అనుమతులు లేవని బెదిరింపులకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్
ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడని సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వేణుగోపాల్ నుంచి ఆర్టీఐ దరఖాస్తు పత్రాలు, లోకాయుక్త పిటిషన్లు, జీహెచ్ఎంసీ గ్రీవియెన్స్ సెల్ ఫిర్యాదు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండుకు తరలిస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: మేడారం వన దేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు