VRA Was Killed in Kannepalli MRO Office : ఎమ్మార్వో ఆఫీసులో వీఆర్ఏ హత్య
08:09 March 14
కన్నెపల్లిలో వీఆర్‌ఏ దుర్గం బాబు హత్య
VRA Was Killed in Kannepalli MRO Office : మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దుర్గం బాబు హత్యకు గురయ్యాడు. కార్యాలయ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు సాగిస్తున్నారు.
కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయ భద్రత కోసం ప్రతిరోజు రాత్రి మండలంలోని ఇద్దరు వీఆర్ఏలు విధులు నిర్వర్తిస్తుంటారు. గత రాత్రి కొత్తపల్లి, జజ్జర్వెల్లి వీఆర్ఏలు విధులకు వెళ్లాల్సి ఉండగా జజ్జర్వెల్లి వీఆర్ఏ రాకపోవడంతో తహశీల్దార్ కార్యాలయంలో దుర్గం బాపు ఒక్కడే విధులకు హాజరయ్యారు. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దుర్గంబాబుపై దాడి చేసి హతమార్చారు. కార్యాలయాన్ని ఇవాళ ఉదయం తెరవడానికి వెళ్లిన సిబ్బంది.. ఆఫీసులో బాబు రక్తపు మడుగులో ఉండటం గమనించి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతణ్ని ఎవరు హత్య చేసుంటారను? మరో వీఆర్‌ఏ కావాలనే విధులకు గైర్హాజరయ్యాడా? దుర్గం బాబు హత్యలో అతని ప్రమేయం ఉందా? బాబుకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాలపై కార్యాలయ సిబ్బంది, స్థానికులను ప్రశ్నించారు. ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో .. పాతకక్షల కారణంగానే చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.