ATM theft in Korutla : జగిత్యాల జిల్లా కోరుట్లలో పండుగ పూట కొందరు దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. వేములవాడ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు చోరీ చేసి అనంతరం కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. ఇదంతా ఓ కంట కనిపెడుతున్న హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం.. సిగ్నల్ రావడంతో వెంటనే కోరుట్ల పోలీసులను అలర్ట్ చేసింది. పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్నారు.
అప్పుడు చోరీ చేసిన నగదుతో కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగల వాహనానికి అడ్డంగా వెళ్లారు. పోలీసులు తమ వాహనంతో దొంగల కారును ఢీకొట్టారు. ఒక్కసారిగా ఢీ కొట్టడంతో కారులో నుంచి డబ్బంతా రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది. ఈ క్రమంలో దొంగలు పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు.